కొవిడ్ నియంత్రణకు త్వరలో టాబ్లెట్లు!

కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి ఇప్పటికే వ్యాక్సిన్లను వినియోగిస్తుండగా, తాజాగా కొవిడ్ నియంత్రణకు యాంటీవైరల్ టాబ్లెట్లు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. మూడు మాత్రలు ప్రయోగాల దశలో ఉన్నట్లు, త్వరలో అంటే దాదాపుగా శీతాకాలం ప్రారంభం నాటికి వీటికి సంబంధించిన ఫలితాలు వెల్లడికానున్నాయని అంటురోగాల నియంత్రణ జాతీయ సంస్థ డైరెక్టర్ కార్ల్ డిఫెన్‌బాచ్ వెల్లడిరచారు. ఈ టాబ్లెట్లు వైరస్ సోకినట్లు గుర్తించిన తర్వాత అది మరింత తీవ్రతరం కాకుండా నియంత్రిస్తాయని వ్యాఖ్యానించారు. ఇదిలా వుండగా ఫైజర్ సంస్థ క్లినికల్ ప్రయోగాలు చివరి దశలో ఉన్నాయి. ఈ టాబ్లెట్ సమర్థంగా పనిచేస్తుందని తేలితే ఈ ఏడాది చివరి లోపు ఇది మార్కెట్‌లోకి వస్తుంది. ఇదొక యాంటీవైరల్ డ్రగ్. ఓ వ్యక్తికి వైరస్ సోకిన తరువాత అతనిలో వైరస్ తీవ్రత పెరగకుండా ఈ డ్రగ్ అడ్డుకట్ట వేస్తుందని ఫైజర్ సంస్థ తెలిపింది.