తెలంగాణలో 2,166 మంది పాజిటివ్
తెలంగాణ రాష్ట్రంలో కరోనా బాధితుల రికవరీ రేటు రికార్డు స్థాయికి చేరుకున్నది. సోమవారం దేశంలో రికవరీ రేటు 80.82 శాతం ఉండగా, తెలంగాణలో 82.43 శాతానికి చేరుకున్నది. ఇప్పటివరకు మొత్తం 25.73 లక్షల వైరస్ నిర్ధారణ పరీక్షలు పూర్తిచేయగా, 1.74 లక్షల మందికి పాజిటివ్‌గా తేలింది. ఇందులో 1.44 లక్షల మంది కోలుకున్నట్టు విడుదల చేసిన బులెటిన్‌లో వైద్యారోగ్యశాఖ పేర్కొన్నది. సోమవారం 2,166 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. జీహెచ్ఎంసీలోనే 309 కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి 166, మేడ్చల్ మల్కాజిగిరిలో 147, కరీంనగర్లో 127, నల్లగొండలో 113, వరంగల్ అర్బన్‌లో 95, నిజామాబాద్, మహబూబాబాద్‌లో 90 చొప్పున. సిద్ధిపేటలో 88, ఖమ్మం 87, జనగామ, భదాద్రి కొత్త గూడెంలలో 79 చొప్పున కేసులు వచ్చాయి.






