కరోనా విస్తృతం…పెరిగిన కేసులు లక్షల్లో

ప్రపంచంలో కరోనా ఎక్కువగా ఉన్న దేశాల సరసన భారతదేశం కూడా చేరుతోంది. దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతుండటంలో రోజుకు కేసుల సంఖ్య లక్షల్లో కనిపిస్తోంది. నిన్న ఒక్కరోజే 3 లక్షల 37వేల 704 కరోనా కేసులు నమోదు అయ్యాయి. 488 మంది మృత్యువాత పడ్డారు. కొవిడ్ పాజిటివిటి రేటు 17.22 శాతానికి పెరిగింది. దేశంలో ఒమిక్రాన్ కేసులు పదివేల 50కి చేరాయి. గడిచిన 24 గంటల్లో 2 లక్షల 42 వేల 676 మంది కరోనా బారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో ప్రస్తుతం 21 లక్షల 13వేల 365 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.