అది సైలెంట్ కిల్లర్ : జస్టిస్ ఎన్వీ రమణ

సుప్రీంకోర్టు భౌతిక విచారణకు హాజరు కావ్వాలన్న అభ్యర్థనపై భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వీ రమణ ఒమిక్రాన్ గురించీ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఒమిక్రాన్ సైలెంట్ కిల్లర్ అని సంబోధించారు. ఒక నెల క్రితం ఈ వేరియంట్ బారినపడ్డానని తర్వాత కోలుకున్నాక కూడా తాను ఆ వేరియంట్ ప్రభావంతో ఇంకా బాధపడుతునే ఉన్నానని అన్నారు. అంతేకాదు తాను కరోనా మొదటి వేవ్‌లోనే కరోనా వైరస్ బారిన పడ్డారని, నాలుగు రోజుల్లో కోలుకున్నానని, మళ్లీ ఇప్పుడు ఈ వేవ్‌లో బారిన పడి బయటపడ్డాక కూడా ఇంకా 25 రోజులుగా బాధపడుతూనే ఉన్నానని అన్నారు. సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్‌ను నేతృత్వం వహిస్తున్న సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో పూర్తి భౌతిక విచారణకు తిరిగి రావాలని సుప్రీంకోర్టు అభ్యర్థించడంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.