స్పుత్నిక్ లైట్ కు కేంద్ర ప్రభుత్వం అనుమతి

దేశీయంగా ఉత్పతి చేసిన 40 లక్షల స్పుత్నిక్ లైట్ టీకా డోసులను రష్యాకు ఎగుమతి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. భారత్‌లో వాటి అత్యవసర వినియోగానికి ఇంకా ఆమోదం లభించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. రష్యాకు చెందిన స్పుత్నిక్ లైట్ అదే దేశం అభివృద్ధి చేసిన స్పుత్నిక్ వి వ్యాక్సిన్ వంటిదే. సింగిల్ డోస్ వ్యాక్సిన్‌గా దాన్ని వినియోగిస్తున్నారు. భారతీయ ఔషధ తయారీ సంస్థ హెటెరో బయోఫార్మా లిమిటెడ్ దేశీయంగా ఈ టీకాను ఉత్పత్తి చేస్తోంది.