రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక

కరోనా తగ్గుముఖం పట్టిన మళ్లీ విజృంభిస్తున్నట్లు కన్పిస్తోంది. చైనా సహా అగ్నేయ ఆసియా, ఐరోపాలోని కొన్ని దేశాల్లో కొన్ని రోజులుగా కొత్త కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. దీంతో భారత్‌లోనూ నాలుగో వేవ్ వచ్చే అవకాశాలున్నట్లు వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్ పట్ల నిర్లక్ష్యంగా ఉండొద్దంటూ రాష్ట్రాలకు హెచ్చరించింది. ప్రజలంతా నిబంధనలు పాటించేలా చూడాలని, టెస్టులు పెంచాలని సూచించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖ రాశారు.