వ్యాకిన్స్ వేయించుకోండి… రూ.840 కోట్లు గెలుచుకోండి!

కొవిడ్ వాక్యిన్ వేయించుకొండి. 116 మిలియన్ డాలర్ల (సుమారు రూ.840 కోట్ల) నగదును సొంతం చేసుకోండి. అమెరికాలోని కాలిఫోర్నియా సర్కారు లక్కీ డ్రా ప్రకటించింది. వచ్చే నెల 15న ఆంక్షలు ఎత్తివేసి, సాధారణ జీవనానికి మార్గం సుగమం చేయనున్న క్రమంలో వ్యాక్సినేషన్‍ను ముమ్మరం చేసేందుకు ఈ వినూత్న వ్యూహాన్ని అమలు చేస్తోంది. 12 ఏళ్లు దాటినవారంతా టీకా తీసుకోవాలని నెలల తరబడి ప్రచారం చేసినా, ఇప్పటి వరకు 3.4 కోట్ల మంది జనాభాలో 63 శాతం మందే వ్యాక్సిన్ వేయించుకున్నారు. మిగిలిన వారికి వీలైనంత త్వరగా తొలి డోసు అందించేందుకు ప్రైజ్ మనీ ఆఫర్‍ను గవర్నర్ గవిన్ న్యూసమ్ వెల్లడించారు.
కనీసం తొలిడోసు తీసుకుంటే దీనికి అర్హత సాధించవచ్చు. జూన్ 4తో లక్కీ డ్రా ప్రారంభమవుతుంది. మొత్తం 10 మందికి 1.5 మిలియన్ డాలర్లు (సుమారు రూ.10.86 కోట్లు), 30 మందికి 50,00 డాలర్లు (రూ.36.21 లక్షలు) నగదు బహుమతులతో పాటు.. 20 లక్షల మందికి 50 డాలర్ల (రూ.3,600) విలువైన గిఫ్ట్ కూపన్లు ఇస్తారు. ముఖ్యంగా యువతను ఆకట్టుకునేందుకు భారీ ఉపకార వేతనాలు, ఫీజుల చెల్లింపులు ప్రకటించాయి.