దక్షిణాఫ్రికాలో మరో కొత్త వేరియంట్ గుర్తింపు

మరో కరోనా కొత్త వేరియంట్‍ని శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనికి సి.1.2గా నామకరం చేశారు. ఈ వేరియంట్ తొలిసారి దక్షిణాఫ్రికాలో వెలుగు చూసింది. ప్రస్తుతానికి ఆందోళనకరమైన వైరస్‍గా వర్గీకరించనప్పటికీ వ్యాక్సిన్‍ల నుంచి తప్పింంచుకునే సామర్థ్యం ఈ వేరియంట్‍కు ఉన్నట్లు తాజా అధ్యయనంలో తేలింది. ఈ ఏడాది మే నెలలో దక్షిణాఫ్రికాలో గుర్తించిన ఈ వేరియంట్ ఆగస్టు 13 నాటికి చైనా, కాంగో, మారిషస్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, పోర్చుగల్, స్విట్జర్లాండ్‍లో దేశాల్లో విస్తరించింది. దక్షిణాఫ్రికాలో మొదటి వేవ్ కాలంలో వెలుగు చూసిన సి.1వేరియంట్ మరిన్ని మ్యుటేషన్లు చెంది సి.1.2 గా రూపాంతరం చెందినట్లు నిపుణులు చెబుతున్నారు.