జో బైడెన్ సలహాదారుడికి కరోనా పాజిటివ్

అమెరికా తదుపరి అధ్యక్షుడు జో బైడెన్ సీనియర్ సలహాదారుడు, కాంగ్రెస్ సభ్యుడు సెడ్రిక్ రిచ్‍మండ్‍కు కరోనా నిర్ధారణ అయ్యింది. తాజాగా జరిపిన పరీక్షల్లో ఆయనకు పాజిటివ్‍గా తెలిసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా బైడెన్‍తో కలిసి ఆయన జార్జియా రాష్ట్రానికి ప్రయాణించారు. దీంతో బైడెన్‍కు కూడా కరోనా పరీక్షలు నిర్వహించారు. అందులో ఆయనకు నెగిటివ్ వచ్చిందని డాక్టర్లు వెల్లడించారు. రిచ్‍మండ్‍లో కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్ష చేయగా కరోనా పాజిటివ్ అని తేలిందని వైద్యులు చెప్పారు. దీంతో ఆయన 14 రోజుల పాటు క్వారంటైన్‍లో ఉండనున్నారు.