బూస్టర్ డోస్ ను తీసుకున్న అమెరికా అధ్యక్షుడు

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కోవిడ్ 19 బూస్టర్ డోస్ తీసుకున్నారు. వైట్‌హౌజ్‌లో ఆయన ఫైజర్ టీకా మూడో డోసు తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా వ్యాక్సిన్ తీసుకోవడానికి విముఖత చూపుతున్న ప్రజలకు దేశానికి నష్టం కలిగిస్తున్నారని విమర్శించారు. మొదటి రెండు డోసులు తీసుకున్న తర్వాత తనకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాలేదని తెలిపారు. అర్హత ఉన్న వారు బూస్టర్ డోస్ తీసుకోవడం చాలా ముఖ్యమని అన్నారు. అమెరికాలో ఇప్పటి వరకు కనీసం ఒక్కడోసు తీసుకున్న వారు 77 శాతంగా ఉన్నారన్నారు. మరో పావు శాతం మంది ప్రజలు కనీసం ఒక్క డోసు వ్యాక్సిన్ తీసుకోవడానికి కూడా నిరాకరిస్తున్నారని, ఇలాంటి వారి వల్లే దేశంలో డెల్టా వేరియంట్ విజృంభిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.