బిడెన్ కోవిడ్ -19 టాస్క్ ఫోర్స్ బృందాన్ని ముందుకు నడపనున్నభారతీయ-అమెరికన్ డాక్టర్ వివేక్ మూర్తి
అమెరికా నూతన అధ్యక్షులు మిస్టర్ జో బిడెన్ గెలిచిన వెంటనే అమెరికా ప్రజల జీవితాలతో ఆడుకుంటున్న కోవిడ్ -19 మీద ధ్యాస పెట్టారు. రోజుకు షుమారు గా 125,000 కు పైగా కొత్త కోవిడ్ -19 కేసుల నమోదు తో ప్రపంచంలోనే అగ్రస్థానంలో కొనసాగుతున్న అమెరికా ను కోవిడ్ -19 బారి నుంచి బయట పడేయటానికి అధ్యక్షులు గా ఎన్నికైన మిస్టర్ జో బిడెన్ యొక్క పరివర్తన బృందం సోమవారం 9th నవంబర్ న 13 మంది తో కూడిన కోవిడ్ -19 టాస్క్‌ఫోర్స్ బృందం ను నియమించింది.
అమెరికా లో షుమారుగా 236,000 కు పైగా ప్రాణాలను బలిగొన్న కోవిడ్ -19 వైరస్ వ్యాపించకుండా అడ్డుకుంటానికి నియమించిన 13 మంది కోవిడ్ -19 టాస్క్‌ఫోర్స్ బృందం ను ముందుకు నడిపే ప్రముఖుల్లో భారత-అమెరికన్ డాక్టర్ వివేక్ మూర్తి కీలక పాత్ర పోషించనున్నారు.
అమెరికా యొక్క పంతొమ్మిదవ సర్జన్ జనరల్‌గా పనిచేసిన డాక్టర్ వివేక్ మూర్తి పబ్లిక్ హెల్త్ సర్వీస్ కమిషన్డ్ కార్ప్స్ భారత-అమెరికన్ వైద్యులు మరియు మాజీ వైస్ అడ్మిరల్ సర్జన్ జనరల్ డాక్టర్ మూర్తి తో పాటు మరో ఇద్దరు ప్రముఖ ప్రజారోగ్య నిపుణులు డాక్టర్ డేవిడ్ కెస్లర్ మరియు డాక్టర్ మార్సెల్ల నూనెజ్-స్మిత్ నాయకత్వం వహించే కోవిడ్ -19 టాస్క్‌ఫోర్స్ బృందం కోవిడ్ -19 వైరస్ వ్యాప్తి ని అడ్డుకుంటానికి అదేవిధంగా కోవిడ్ -19 ని అరికట్టే విధానాలు గురించి మిస్టర్ బిడెన్ మరియు వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ కు సలహా ఇవ్వబోతున్నారు.
13 మంది సభ్యుల టాస్క్‌ఫోర్స్ బృందం లో సర్జన్, ప్రజారోగ్య పరిశోధకులు మరియు రచయిత భారతీయ-అమెరికన్ డాక్టర్ అతుల్ గవాండే మరియు అంటు వ్యాధి మరియు ప్రపంచ ఆరోగ్య నిపుణులు భారతీయ-అమెరికన్ డాక్టర్ సెలిన్ గౌండర్ కూడా ఈ బృందం లో ఉండడం విశేషం.






