త్వరలో అమెరికాలో కొవాగ్జిన్ : భారత్ బయోటెక్

కెనడా, అమెరికా దేశాల్లోనూ కొవాగ్జిన్ టీకాను అందుబాటులోకి తెచ్చేందుకు కట్టుబడి ఉన్నట్టు భారత్ బయోటెక్ ప్రకటించింది. ఇందుకోసం ఆక్యుజెన్ ఇంక్ అనే అమెరికా కంపెనీతో కలిసి పని చేస్తున్నట్టు తెలిపింది. ఈ రెండు దేశాల్లోనూ అన్ని వయసుల వారికీ ఈ టీకాను అందుబాటులోకి తేవడమే తమ లక్ష్యమని భారత్ బయోటెక్ తెలిపింది. కరోనా టీకా క్యాండిడేట్‌గా కొవాగ్జిన్‌ను అమెరికా పరిశీలించగలదని భారత్ బయోటెక్ గత నెలలో పేర్కొంది. ఐసీఎమ్‌ఆర్‌తో కలిసి భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ను ప్రస్తుతం భారత్‌తో పాటు మరికొన్ని దేశాల్లో కరోనా టీకాగా వినియోగిస్తున్నారు. అమెరికా, కెనడాల్లో కొవాగ్జిన్ టీకా క్యాండిడేట్‌కు సహ అభివృద్ధి సంస్థగా ఆక్యుజెన్ ఇంక్ పనిచేస్తోంది.