దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు…

దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో 16,432 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. తాజాగా నమోదైన కేసులలో మొత్తం కేసుల సంఖ్య 1,02,24,303కు పెరిగింది. మరో 252 మంది మహమ్మారికి బలవగా.. మృతుల సంఖ్య 1,48,153కు చేరింది. గడిచిన 24 గంటల్లో 24,900 మంది కోలుకోగా.. మొత్తం 98,07,569 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం దేశంలో క్రియాశీల కేసులు 2,68,581 ఉన్నాయని మంత్రిత్వశాఖ వివరించింది.
గడిచిన ఆరు నెలల్లో అత్యల్ప సంఖ్యలో కొవిడ్ కేసులు నమోదవడం ఇదే తొలిసారి అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. వరుసగా ఎనిమిదో రోజు యాక్టివ్ కేసులు మూడు లక్షల కన్నా తక్కువగా ఉన్నాయని, కాసేలోడ్‍లో 2.63 శాతం ఉన్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలో రికవరీ రేటు 95.92 శాతానికి చేరకుందని, కొవిడ్ మరణాల రేటు 1.45 శాతంగా ఉందని వివరించింది.