ఉత్తరకొరియాపై ఆంక్షలు ఎత్తివేయాలి
ఉత్తరకొరియాపై విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను కోరారు. గతవారం జపాన్‌లోని ఒసాకా నగరంలో జరిగిన జీ-20 సదస్సులో ఇరుదేశాధినేతలు ఉత్తరకొరియా ఆంశంపై సుదీర్ఘ మంతనాలు జరిపినట్టు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ వెల్లడించారు. ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్, ట్రంప్ స్నేహపూర్వకంగా మెలగాలని జిన్‌పింగ్ ఆకాంక్షిస్తున్నారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న అపరిష్కృత సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని కోరారు అని వాంగ్ యీ అన్నారు. ఉభయ కొరియా దేశాల సరిహద్దులోని డీమిలిటరైజ్డ్ జోన్లో కిమ్‌తో ట్రంప్ భేటీ కావడం జిన్‌పింగ్ దౌత్య ఫలితమేనని వాంగ్ యీ తెలిపారు.













