అట్లాంటాలో ఘనంగా మహిళా దినోత్సవ సంబరాలు
అట్లాంటాలో మార్చి 19న అమెరికన్ తెలుగు సంఘం(ఆటా) నిర్వహించిన మహిళా దినోత్సవ సంబరాలకు ముఖ్య అథితిగా ఫోర్‑సిత్ కౌంటీ బోర్డ్ కమిషనర్ సిండి జోన్స్మిల్స్, డా.సుజాత రెడ్డి, డా.ఆనంద మాధురి, డా.మాధురి నముదురి, ప్రత్యేక అథితిగా భారతీ రత్నం హాజరయ్యారు. దాదాపు 300లకు పైగా మహిళలు ఈ కార్యక్రమంలోపాల్గొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా మహిళల పాటలు, నృత్యాలు అక్కడికొచ్చిన వారందరిలో ఉత్సాహాన్ని నింపాయి. ఆటా మహిళా ప్రతినిధులు శ్రీమతిఅరుంధతి కోడురు, స్వప్న పాశం, లక్ష్మి నరం రెడ్డి, అనుపమ సుబ్బగారి, ఉదయ ఏటూరు, శ్రావణి రాచకుల్లలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అమెరికన్ తెలుగు సంఘంఅధ్యక్షుడు శ్రీ కరుణాకర్ ఏసిరెడ్డి, ట్రెజరర్ కిరణ్ పాశం, బోర్డ్ ఆఫ్ ట్రస్టీ అనిల్ బొద్దిరెడ్డి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినందుకు రీజినల్ కోఆర్డినేటర్ శివకుమార్ రామడ్గు,ప్రశాంత్ ప్రొద్దుటూరులతో పాటూ మిగతా మహిళా ప్రతినిధులని అభినందించారు. ఆటా తరఫున ప్రశాంతి ఏసిరెడ్డి, విక్రం సుదిని, వేణు పిస్కె, ఉమేష్ ముత్యాల, శ్రీధర్తిరుపతి, ప్రషీల్ గుకంటి, సాయి గొర్రపటి, రమన ఉప్పిరి, తిరుమల్ పిట్ట, అరుణ్ కట్పల్లి, వెంకట్ వీరనేని, సురేష్ వోలం, నంద చాట్లలు ఈ కార్యక్రమాన హాజరైన మహిళలందరికి ధన్యవాదాలు తెలిపారు.













