తప్పుడు వార్తలను పసిగట్టే టిప్
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తప్పుడు వార్తలు మరింత ఎక్కువగా ప్రచారమయ్యే ప్రమాదం ఉండటంతో వాటికి అడ్డుకట్ట వేసేందుకు భారత్‌కు చెందిన అంకుర సంస్థ ప్రొటో చెక్‌పాయింట్ టిప్‌లైన్ అనే సేవలను ప్రారంభించింది. ఈ విషయాన్ని వాట్సాప్ ఒక ప్రకటనలో వెల్లడించింది. దీని ద్వారా వాట్సాప్‌లో చక్కర్లు కొట్టే అసత్య ప్రచారాలు, వదంతులను సులభవంగా తెలుసుకోవచ్చని పేర్కొంది. మనకు వచ్చిన సందేశాల్లో ఏమైనా అనుమానాలు ఉంటే.. వెంటనే వాటిని టిప్‌లైన్‌కు చెందిన + 91 9643000888 నంబర్ వాట్సాప్ చేయాలి. వెంటనే ఆ వార్తలను విశ్లేషించి, అది నిజమో.. కాదో చెబుతుంది. నిజం, అబద్దం, తప్పుదోవ పట్టించేవి వివాదాస్పదమైనవి అనే నాలుగు కేటగిరీల్లో ఆ వార్తను క్రోడీకరిస్తుంది.













