Literature Seminar: విశ్వర్షి వాసిలి – అంతర్జీతీయ సాహితీ సదస్సు

విశ్వర్షి వాసిలి వాజ్మయం- దృక్ఫథాల ఆవిష్కరణ అంతర్జీతీయ సాహితీ సదస్సు మధురై కామరాజు విశ్వవిద్యాలయం వారు అక్టోబర్ 9 మరియూ 10, 2025న నిర్వహిస్తున్నారు. సాహిత్యాభిమానులు, సాహితీవేత్తలు, పరిశోధనా విద్యార్ధులు విశ్వర్షి వాసిలి సాహిత్యం మీద పరిశీలన మరియు పరిశోధనా పాత్రలు సమర్పించవలసిందిగా సదస్సు సంచాలకులు డాక్టర్ జొన్నలగడ్డ వెంకటరమణ, పి. రమేష్ మరియు కొండయ్య కోనూరు కోరుతున్నారు. Spiritual Foundation, మెంఫిస్, టేనస్సీ (USA) వ్యవస్థాపకులు శ్రీమతి చంద్రప్రభ వాసిలి మరియు డా. రమణ వి. వాసిలి దంపతులు ఉత్తమ పత్రరచన, ఉత్తమ పత్రసమర్పణ మరియు ఉత్తమ తులనాత్మకపత్రం చేసినవారికి ప్రత్యేక బహుమతులు ప్రదానం చేయనున్నారు.
ఈ జాతియ సదస్సులో బెంగళూరు విశ్వవిద్యాలయం తెలుగు విభాగం విశ్రాంతి ఆచార్యులు జీ ఎస్ మోహన్ గారికి విశ్వర్షి వాసిలి సాహిత్య పురస్కారంతో సత్కరించనున్నారు. అలాగే Spiritual Foundation వారు విశ్వర్షి వాసిలి గారికి జీవిత సాఫల్య పురస్కారం – Living for Generations ప్రధానం చేయనున్నారు.
మరిన్ని వివరాలకు ఈక్రిండి విశ్వవిద్యాలయంవారి బ్రోచెర్ని చూడండి.
Dr. Ramana Vasili
Spiritual Foundation
7062 Beringer Drive South
Cordova, Tennessee 38018, USA
901-387-9646
ramanavvasili@hotmail.com