వైట్‌హౌజ్‌లో వేద పఠనం
అమెరికాలో కొనసాగుతున్న కరోనా కల్లోలానికి అడ్డుకట్ట వేసేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేయని ప్రయత్నం లేదు. ఏదీ సఫలం కాకపోవడంతో ఇప్పుడు దేవుడిపై భారం వేసేశారు. జాతీయ ప్రార్థన దినోత్సవం సందర్భంగా వైట్‌హౌజ్‌లో వేదిక్ శాంతి పఠనం పేరుతో ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. అమెరికా ప్రజల ఆరోగ్యం, రక్షణ కోసం తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని స్వామి నారాయణ్ మందిర్ పూజారి హరీశ్ బ్రహ్మభట్ నిర్వహించారు. ప్రార్థనకు ముందు బ్రహ్మభట్ మాట్లాడుతూ ఇది శాంతి కోసం చేసే అద్భుతమైన హిందూ ప్రార్థన. ఇది యజుర్వేదంలో ఓ భాగం. ఈ ప్రార్థన ఒక్క అమెరికాకే కాదు. స్వర్గానికి, భూమ్యాకాశాలకు, సకల జీవరాశికి, ప్రకృతికి అన్నింటికీ శాంతి చేకూరుస్తుంది అని అన్నారు. ప్రార్థనానంతరం ఆయన ఆ సారాంశాన్ని ఆంగ్లంలో బోధించారు.













