Vanguri Foundation: ఆరియా విశ్వవిద్యాలయానికి వంగూరి దంపతుల లక్ష డాలర్ల విరాళం

హ్యూస్టన్‌లో 14వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా కాలిఫోర్నియాలోని ఆరియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ పురోభివృధ్ధికి వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా (Vanguri Foundation of America) తరఫున వంగూరి చిట్టెన్ రాజు, గిరిజ దంపతులు లక్ష డాలర్ల భూరి విరాళం చెక్కును సభాముఖంగా ప్రకటించి, విశ్వవిద్యాలయం డైరెక్టర్ రాజు చామర్తికి అందజేశారు. ఈ సందర్భంగా తెలుగు భాషా, సాహిత్యాలకి ఎవరో, ఏదో చేయాలనే కంటే ఉన్న వ్యవస్థలను పటిష్టం చేయాలని వంగూరి చిట్టెన్ రాజు పిలుపునిచ్చారు. దానికి ఆచార్య యార్లగడ్డ, రాజు చామర్తి సముచితంగా స్పందించారు. శాయి రాచకొండ, రాధిక మంగిపూడి, బుర్రా సాయి మాధవ్ పాల్గొన్న ఈ ప్రత్యేక వేదిక సదస్సు విశిష్ట ప్రాధాన్యతను సంతరించుకుంది.