మెంఫిస్ తెలుగు సమితి (TAM) ఆధ్వర్యంలో ‘‘వన భోెజనాలు’’
మెంఫిస్ తెలుగు సమితి (TAM) వన భోజనాలు 2026 కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అక్టోబర్ 4 వ తేదీన WALL DOXEY PARK 3946,ms7, HOLLY SPRINGS, MS38635 లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఉదయం 10:00 గంటల నుంచి సాయంత్రం 4:00 గంటల వరకూ ఈ కార్యక్రమం కొనసాగుతుంది.
మెంఫిస్ తెలుగు సమితి సభ్యులకు ఎంట్రీ ఉచితంగా వుంటుంది. సభ్యులు కాని వారికి మాత్రం ఎంట్రీ ఫ్రీ ఒక్కొక్కరికి 15 డాలర్లుగా నిర్ణయించారు. అలాగే పార్క్ ఎంట్రీ ఫీ ఒక్కో వ్యక్తికి 2 డాలర్లుగా వుంటుంది.
ఈ వన భోజనాల సందర్భంగా ఫన్ గేమ్స్ కూడా వుంటాయి. అలాగే చిన్న పిల్లలకు ఆటలు, పెద్ద వారికి ఆటలు విడివిడిగా వుంటాయి. అలాగే అవుట్ డోర్ కుక్కింగ్, గ్రిల్లింగ్ కూడా వుంటాయి.
ఈ సందర్భంగా స్టార్టర్స్ కింద కార్న్, చికెన్ తందూరి, తంగడి కబాబ్, ఖాజు నట్స్ కూడా ఇస్తున్నారు.
ఇక.. లంచ్ లో కేసరి పైనాపిల్, రోటి రచ్చటి, పాస్తా, టోమాటో పాలక్ పప్పు, మిక్స్ వెజ్ కరీ పనీర్, చికెన్ పలావ్, బగారా రైస్ విత్ మిల్ మేకర్, వైట్ రైస్, YOGURT BUCKET, పాపడ్, పికిల్, నెయ్యి తో కూడిన లంచ్ వుంటుంది.
ఇక.. ఈవినింగ్ స్నాక్స్ గా చాట్ పాపడ్, సేవ్, ఆనియన్, టొమాటో, టీ కూడా సర్వ్ చేస్తున్నారు.
ఇంతటి అందమైన, ఆకర్షణీయమైన వన భోజనాలు కార్యక్రమానికి స కుటుంబ సమేతంగా, పిల్లలు, పెద్దలు.. ఇలా అందరితో కలిసి వెళ్దాం. హాయిగా, ఆనందంగా గడుపుదాం.
కార్యక్రమ వివరాలు :
తేదీ : అక్టోబర్ 4,
సమయం : ఉదయం 10:00 నుంచి సాయంత్రం 4:00 వరకు
వేదిక : WALL DOXEY PARK 3946,ms7, HOLLY SPRINGS, MS38635
ఇతర ఆకర్షణీయమైనవి :
ఉదయం స్నాక్స్
మధ్యాహ్నం లంచ్
సాయంత్రం స్నాక్స్
ఫన్ గేమ్స్, పిల్లలకు గేమ్స్, పెద్దలకు గేమ్స్
అవుట్ డోర్ కుకింగ్








