అమెరికాతో చర్చలకైనా..యుద్ధానికైనా రెడీ..
అమెరికాతో యుద్ధం సంభవిస్తే దానిని దీటుగా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా వున్నామని ఇరాన్ విదేశాంగశాఖ ఉప మంత్రి అబ్బాస్ అరాక్చీ సృష్టం చేశారు. అయితే యుద్ధం కన్నా చర్చల ద్వారానే ఉద్రికత్తలను ఉపశమనం లభించి సమస్యలకు పరిష్కారం లభిస్తుందని తాము భావిస్తున్నామని ఆయన మీడియాకు తెలిపారు. అమెరికా ప్రభుత్వంలోని కొన్ని శక్తులు ట్రంప్‌ను యుద్ధానికి రెచ్చగొడుతున్నాయన్న విషయం తమకు తెలుసని ఆయన చెప్పారు. ఒకవేళ యుద్ధమే అనివార్యమైతే అది మధ్యప్రాచ్యం మొత్తానికి ముప్పుగా పరిణమిస్తుందని అన్నారు. ఏ పరిస్థితినయినా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగానే వున్నామని, అమెరికా బెదిరింపులను ఇరాన్ ఏ మాత్రం లెక్కచేయదని ఆయన పునరుద్ఘాటించారు.













