పాకిస్థాన్ కు 80 లక్షల డాలర్ల సాయం : అమెరికా
తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న అమెరికా కరోనా వైరస్ పోరులో భాగంగా ఇతర దేశాలను ఆదుకుంటోంది. కొవిడ్-19 పోరులో భాగంగా దాదాపు 64 దేశాలకు 174 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయాన్ని గత రెండు వారాల క్రితమే అమెరికా ప్రకటించింది. తాజాగా పాకిస్థాన్‌కు 80 లక్షల డాలర్ల ఆర్థిక సాయాన్ని చేస్తున్నట్లు ప్రకటించింది. కరోనా వైరస్ వ్యాప్తి నివారణతో పాటు బాధితులకు చికిత్స అందించడంలో ఈ నిధులను ఉపయోగిస్తామని పాకిస్థాన్‌లోని అమెరికా రాయబారి పౌల్జోన్స్ వెల్లడించారు. కరోనా పోరులో భాగంగా భారత్‌కు దాదాపు 29 లక్షల డాలర్లను అందిస్తామని ఇప్పటికే ప్రకటించింది.













