వెనక్కు తగ్గిన డొనాల్డ్ ట్రంప్
అమెరికాలో పెల్లుబికిన నిరసనలను అణచివేసేందుకు సైన్యాన్ని దింపుతానని హెచ్చరించిన ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాస్త మొత్తబడ్డారు. స్థానిక ప్రభుత్వాలు శాంతిభద్రతలను సాధారణ స్థితికి తేవాలని వైట్‌హౌస్ ఉన్నతాధికారులు ప్రకటించారు. మంగళవారం జరిగిన నిరసన ప్రదర్శనల్లో హింసాత్మక సంఘటనలు తగ్గడంతో ట్రంప్ కాస్త మెత్తబడినట్లు వైట్‌హౌస్ వర్గాలు చెప్తున్నాయి. సైన్యాన్ని దింపి, నిరసనలను అణచివేయాలన్న ఆలోచనను విరమించుకున్నట్లు తెలిపాయి. వైట్‌హౌస్ సీనియర్ అధికారి మాట్లాడుతూ దేశ రాజధాని నగరంలో నిరసనలను అణచివేయడం ద్వారా మిగతా రాష్ట్రాలకు ఓ ఉదాహరణగా నిలవాలని ట్రంప్ భావించినట్లు తెలిపారు. అవసరమైతే సైన్యాన్ని ఏ విధంగా మోహరించాలో డిఫెన్స్ డిపార్ట్మెంట్ ఓ ప్రణాళికను కూడా రూపొందించిందన్నారు.













