అమెరికా బెదిరింపులకు భయపడం
ఫ్రెంచ్ ఉత్పత్తులపై టారిఫ్‌లు పెంచుతామంటూ అమెరికా తరచు చేస్తున్న బెదిరింపులపై ఉమ్మడి పోరుకు ఫ్రాన్స్, ఈయూ సిద్ధంగా ఉన్నాయని ఫ్రెంచ్ మంత్రులు ప్రకటించారు. ఫ్రాన్స్ నుంచి దిగుమతి అయ్యే షాంపేన్ వంటి దాదాపు 240 కోట్ల డాలర్ల విలువైన ఉత్పత్తులపై 100 శాతం సుంకాలు విధిస్తామంటూ అమెరికా చేసిన ప్రకటనపై తీవ్రంగా స్పందించిన మంత్రులు ఈ వ్యాఖ్యలు చేశారు. ఫ్రాన్స్ ఆర్థిక మంత్రి బ్రూనో లీ మారీ మీడియాతో మాట్లాడారు. అమెరికా ప్రతిపాదనలు ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని అన్నారు. అమెరికా తాజాగా ఆంక్షలు విధిస్తే వాటిని తిప్పికొట్టేందుకు ఫ్రాన్స్‌తో పాటు ఐరోపా కూటమి కూడా సిద్ధంగా ఉందని ఆయన అన్నారు. ఆర్థిక శాఖ ఉపమంత్రి పన్నీర్ రునాచర్ మాట్లాడుతూ ఈ విషయంలో అమెరికాతో వ్యవహరించే అంశంపై ఫ్రాన్స్ పోరాడుతూనే ఉంటుందని, డిజిటల్ టాక్స్ ప్రతిపాదనలను ఉపసంహరించుకోబోమని సృష్టం చేశారు.













