బోయింగ్ విమాన సేవలపై అమెరికా నిషేధం
బోయింగ్ విమాన సేవలపై అమెరికా తాత్కాలిక నిషేధం విధించింది. ఈ మేరకు ఫెడరల్ ఏవియేషన్ ఆడ్మినిస్ట్రేషన్ సంస్థ ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు బోయింగ్ విమాన సేవలపై నిషేధం విధించినట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఐదు నెలల వ్యవధిలో రెండు ఘోర విమాన ప్రమాదాలు సంభవించాయి. రెండు ప్రమాదాల్లోనూ బోయింగ్ విమానాల్లో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా ప్రమాదాలు జరిగినట్టు నిపుణులు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో బోయింగ్ విమాన సేవలు ఒక్కో దేశం నిషేధిస్తున్నాయి. సింగపూర్, ఆస్ట్రేలియా, బ్రిటన్, భారత్ దేశాల్లో ఇప్పటికే బోయింగ్ విమాన సేవలను నిషేధించగా తాజా జాబితాలో అగ్రరాజ్యం చేరింది. కాగా, ఈ నెల 10న ఇథియోపియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్-737 విమానం నైరోబి రాజధాని ఆడిస్అబాబాలో ప్రమాదానికి గురైంది. విమానంలోని ప్రయాణీకులు, పైలట్లు, సిబ్బంది సహా 157 మంది మృతి చెందారు.













