కిమ్, ట్రంప్ సదస్సుపై ఉన్నతస్థాయి భేటీ
ఉత్తరకొరియాతో సదస్సులేనట్లేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పినా ఈ రెండు దేశాధ్యక్షుల మధ్య జూన్ 12వ తేదీ సమావేశం జరగవచ్చని నిపుణులు చెపుతున్నారు. రెండు దేశాలకు చెందిన ఉన్నతస్థాయి అధికారులు న్యూయార్క్‌లో సమావేశమయ్యారు. పాంగ్యాంగ్ అణు ఆయుధల కార్యక్రమంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌జాంగ్ ఉన్‌ల మధ్య చర్చలకు సానుకూల వాతావరణం ఈ అధికారుల భేటీలో కనిపించిందని నిపుణులు చెపుతున్నారు. అమెరికా హోంశాఖ మంత్రి మైక్ పాంపియో కిమ్‌జాంగ్ చాల్ ఉత్తరకొరియా కిమ్ సన్నిహితుడు కలిసి ఇద్దరు 90 నిమిషాలపాటు ఒక విందుసమావేశంలో సుదీర్ఘ చర్చలు జరిపారు. పాంపియో మాట్లాడుతూ విందు అద్భుతంగా జరిగిందని, అమెరికా బీఫ్‌తో విందు జరిగిందని చెప్పారు. అమెరికా, ఉత్తరకొరియాల మధ్య నెలకొన్న సుదీర్ఘ వైషమ్యాలపై ఈ సమావేశంలో చర్చించరా లేదా అనేది మాత్రం సందేహంగా మిగిలింది.













