అమెరికా మరో కీలక నిర్ణయం
సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్న ట్రంప్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రష్యా నుంచి సైనిక పరికరాలు కొనుగోలు చేసే దేశాలపై కన్నెర్ర జేసింది. రష్యా నుంచి ఆర్మీ పరికరాలు కొనుగోలు చేసే దేశాలకు ఏ విషయంలోనూ తమ మద్దతు ఉండబోదని ప్రకటించింది. అమెరికా రక్షణ శాఖ మంత్రి జిమ్ మ్యాటిస్ చేసిన ఈ ప్రకటన భారత్ సహా ఇతర ఆసియా దేశాలకు కూడా వర్తిసుందా లేది అనేది తెలియరాలేదు. ఎన్నో ఏళ్లుగా రష్యా నుంచి సైనిక సామాగ్రి, నైపుణ్య వస్తువులను కొనుగోలు చేస్తున్న భారత్‌కు కూడా అమెరికా నిర్ణయం వర్తిస్తుందా అనే విషయంలో క్లారిటీ లేదు. ఇక భూ ఉపరితలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే ఎస్ -400 క్షిపణులను కూడా కొనుగోలు చేసేందుకు భారత్ రష్యాతో చర్చలు జరుపుతోంది. ఈ నేపథ్యంలో అమెరికా చేసిన ప్రకటన ప్రభావం ఎలా ఉండబోతోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.













