అమెరికా వర్సిటీ అధ్యక్షురాలిగా తెలుగు మహిళ
అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ లూయిస్విల్లేకి 18వ ప్రెసిడెంట్‌గా ఆంధ్రా విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థి నీలి బెండపూడి నియమితులయ్యారు. ఆంధ్రా విశ్వవిద్యాలయం (ఏయూ) ఆంగ్ల విభాగం విశ్రాంత ఆచార్యులు టి. రమేష్ దత్తా, ఆచార్య పద్మదత్తల కుమార్తె అయిన ఆమె ఏయూలో ఎంబీఏ చదివారు. ప్రస్తుతం అమెరికాలోని కాన్సాస్ విశ్వవిద్యాలయానికి ఎగ్జిక్యూటివ్ వైస్ ఛాన్సలర్‌గా వ్యవహరిస్తున్నారు. మే 15న లూయిస్విల్లే వర్సిటీ ప్రెసిడెంట్‌గా నీలి బెండపూడి బాధ్యతలు స్వీకరిస్తారని ఏయూ జర్నలిజం విభాగం అధిపతి ఆచార్య చల్లా రామకృష్ణ తెలిపారు.













