ట్రంప్- కిమ్ భేటీపై ఐరాస సంతృప్తి
ఉభయ కొరియా దేశాల సరిహద్దు ప్రాంతమైన డీమిలిటరైజ్డ్ జోన్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ భేటీ కావడం పల్ల ఐరాస సంతృప్తి వ్యక్తం చేసింది. ఈ మేరకు ఐరాస జనరల్ సెక్రెటరి ఆంటోనియా గుటేరస్ ఓ ప్రకటన విడుదల చేశారు. కొరియా ద్వీపకల్పంలో శాంతి స్థాపన కోసం ఉత్తరకొరియా కట్టుబడి ఉందని కిమ్ చేసిన ప్రకటనకు ఫిదా అయ్యానని అన్నారు. శాంతి, సుస్థిరత కోసం నిరాయుధీకర మార్గంపై కిమ్ దృష్టిపెట్టడం అభినందనీయమని అన్నారు. అమెరికా అధ్యక్షుడి ట్వీట్‌పై స్పందించిన ఉత్తరకొరియాకు ఆహ్వానించిన కిమ్ చాలా గొప్పవారని ప్రశంసించారు. ఉత్తరకొరియాపై ఆంక్షలు ఎత్తివేత్త అంశంపై ట్రంప్ సానుకూలంగా స్పందిస్తారనే ఆశాభావం తనకుందని గుటేరస్ తెలిపారు.













