ముస్లిం బ్రదర్ హుడ్ ఓ ఉగ్రసంస్థ : ట్రంప్
ఈజిప్టులో భారీ విధ్వంసాలకు పాల్పడుతున్న ముస్లిం బ్రదర్హుడ్ సంస్థ (ఇక్వాన్ అల్ ముస్లిమీన్) కరుడుగట్టిన ఉగ్రసంస్థ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఈ సంస్థను అంతర్జాతీయ ఉగ్రసంస్థల జాబితాలో చేర్చుతామని అన్నారు. గత నెల 8న ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ఎల్సిసీ అమెరికాలో పర్యటించారు. ముస్లిం బ్రదర్హుడ్ సంస్థ అఘాయిత్యాలను, అరాచకాల గుర్తించి ట్రంప్‌తో చర్చించారు. ఈ గ్రూపునకు చెందిన మిలిటెంట్ల కారణంగా ఈజిప్షియన్లు ఇబ్బంది పడుతున్నారని, ఈ సంస్థ నిర్మూలనకు తగిన చర్యలు తీసుకోవాలని ట్రంప్‌ను అభ్యర్థించారు.













