కిమ్ ఆరోగ్యంగా ఉండాలి : ట్రంప్
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్యంగా ఉండాలని తాను అభిలషిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. హృదయ సంబంధిత శస్త్ర చికిత్స అనంతరం ఆయన పరిస్థితి విషమంగా మారిందని, బ్రెయిన్ అయ్యారన్న వార్తలు వచ్చిన నేపథ్యంలో ట్రంస్ స్పందించారు. అయితే ఆ వార్తల్లో నిజానిజాలపై ఆయన ఏ వ్యాఖ్య చేయలేదు. కిమ్‌తో తనకు అత్యంత సన్నిహిత, మంచి సంబంధాలు ఉన్నాయని, బాగుండాలని కోరుకుంటున్నానని చెప్పారు. ఆయన పరిస్థితి బాగోలేదన్న పత్రికల సమచారం ఆధారంగా తాను ఈ వ్యాఖ్య చేస్తున్నానని చెప్పారు.













