ఫిబ్రవరి 5న ట్రంప్ ఉభయసభల ప్రసంగం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫిబ్రవరి 5న ‘స్టేట్ ఆఫ్ యూనియన్ ఆడ్రస్’ ఇవ్వనున్నారని అమెరికా ప్రతినిధుల సభ స్సీకర్ నాన్సీ పెలోసీ వెల్లడించారు. ప్రతి సంవత్సరం అమెరికా అధ్యక్షుడు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించడం అక్కడి అనవాయితీ. వైట్ హౌస్, నాన్సీ పెలోసీల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ట్రంప్ ఫిబ్రవరి 5వ తేదీన అమెరికా కాంగ్రెస్ను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. మొదట ఈ ప్రసంగం మంగళవారం ఉంటుందని ప్రణాళిక వేయగా.. అమెరికా షట్డౌన్ కారణంగా దాన్ని వాయిదా వేశారు. షట్డౌన్ ముగిసిన తర్వాతే ప్రసంగిస్తానని ట్రంప్ వెల్లడించారు.ఆహ్వానాన్ని అంగీకరించిన ట్రంప్.. ప్రసంగంలో గొప్ప అంశాలు ఉంటాయని, గొప్ప లక్ష్యాల గురించి మాట్లాడతానని సమాధానమిచ్చారు.













