డొనాల్డ్ ట్రంప్ కు వార్నింగ్ ఇచ్చిన ట్విట్టర్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు తొలిసారి ట్విట్టర్ సంస్థ వార్నింగ్ ఇచ్చింది. ట్రంప్ చేసిన ట్వీట్ అందర్నీ తప్పుదోవ పట్టిస్తున్నట్లు ఆ సంస్థ తన వార్నింగ్‌లో పేర్కొన్నది. మెయిల్ బ్యాలెట్లతో ఫ్రాడ్ జరుగుతుందని ట్రంప్ చేసిన ట్వీట్స్‌ను మైక్రోబ్లాగింగ్, సోషల్ నెట్విర్కింగ్ సర్వీస్ ట్విట్టర్ సంస్థ తప్పుపట్టింది. మెయిల్ బ్యాలెట్ల ట్వీట్లు రెండింటికి ఆ సంస్థ వార్నింగ్ లేబుల్ ఇచ్చింది. కొత్త పాలసీ ప్రకారం ట్విట్టర్ ఆ హెచ్చరిక చేసింది. ట్విట్టర్ సంస్థ చేసిన వార్నింగ్ పట్ల ఆ తర్వాత ట్రంప్ కూడా స్పందించారు. భావస్వేచ్ఛను అడ్డుకోవడమే అంటూ ట్విట్టర్ సంస్థపై ట్రంప్ ఫైర్ అయ్యారు. ట్రంప్ చేసిన ట్వీట్ల కింద బ్లూమార్క్ చేశారు. వాస్తవాలు తెలుసుకోవాలని ఆ హెచ్చరికల్లో రాశారు. ఎవరైనా తప్పుడు సమచారం కానీ, తప్పుదోవ పట్టించే సమచారం కానీ పోస్టు చేస్తే, వారికి వార్నింగ్ ఇచ్చే విధంగా ట్విట్టర్ కొత్త మార్పులు తీసుకువచ్చింది. నెల క్రితమే వార్నింగ్‌లకు సంబంధించి ట్విట్టర్ కొత్త విధానాన్ని తీసుకువచ్చింది. ఈ ఏడాది నవంబర్ 3న జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో ట్విట్టర్ సంస్థ జోక్యం చేసుకుంటున్నట్లు ట్రంప్ ఆరోపించారు.













