న్యూయార్క్ నుండి ఫ్లోరిడాకు మారిపోతా : ట్రంప్
అమెరికా అధ్యక్షుడు తన శాశ్వత నివాసాన్ని న్యూయార్క్ నుంచి ఫ్లోరిడాకు మారుస్తున్నట్టు ప్రకటించారు. తన సొంత నగరంలో తన పట్ల ఘోరంగా ప్రవర్తించారని ఆరోపించారు. ఫ్లోరిడాలోని పామ్ బీచ్ రిసార్ట్ తమ కుటుంబ శాశ్వత నివాసం అని ట్రంప్ ట్వీట్ చేశారు. తను న్యూయార్క్, న్యూయార్క్ ప్రజలను ఎంతో ఆదరించానని కానీ దురదుష్టవశాత్తు రాజకీయ నేతలు దారుణంగా వ్యవహరించారన్నారు. ప్రతి సంవత్సరం స్థానిక పన్నుల రూపంలో మిలియన్ డాలర్లు చెల్లిస్తున్నప్పటికీ అనుచితంగా ప్రవర్తించరని ఆయన ఆరోపించారు. ట్రంప్ తన ప్రాథమిక నివాసాన్ని ఎందుకు మార్చారో వైట్ హౌస్ అధికారులు చెప్పేందుకు నిరాకరించారని న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో తెలిపింది.













