సిరియా నుండి తమ దళాలు వెనక్కు : ట్రంప్
సిరియా నుంచి తమ దళాలను త్వరలో ఉపసంహరించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. పశ్చిమాసియాలో జరిగిన యుద్ధాల కోసం అమెరికా ఏడు లక్షల కోట్ల డాలర్లు వృధా చేసిందన్నారు. సిరియాలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులను అంతం చేసేందుకు అమెరికా అన్ని ప్రయత్నాలు చేసిందన్నారు. ఇస్లామిక్ స్టేట్‌ను రూపుమాపుతున్నామని, త్వరలోనే సిరియా నుంచి బయటకు రానున్నట్లు ట్రంప్ తెలిపారు. యుద్దాల కోసం లక్షల కోట్లు ఖర్చు చేసి, దేశంలో మౌలిక సదుపాయాలను కల్పించుకోలేకపోయామని అన్నారు. ఒహియాలో జరిగిన ఓ సమావేశంలో మాట్లాడుతూ ట్రంప్ ఈ విషయాన్ని వెల్లడించారు.













