ఐసిస్ చీఫ్ బాద్దాదీ హతం : ట్రంప్
ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ అధినేత అబు బుకర్ బాగ్దాదీ హతమైనట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. అమెరికా సైన్యానికి భయపడి బాగ్దాదీ ఆత్మహత్య చేసుకున్నాడని ట్రంప్ ధృవీకరించారు. ట్రంప్ మాట్లాడుతూ అమెరికా సైనిక దాడుల సమయంలో ఐసిస్ చీఫ్ ఆత్మాహుతికి పాల్పడ్డాడు. తన ముగ్గురు పిల్లలను చంపి, తను ఆత్మహత్యకు పాల్పడ్డట్లు ట్రంప్ తెలిపారు. ప్రపంచాన్ని భయపెట్టాలనుకున్న బాగ్దాదీ.. అమెరికా సైన్యానికి భయపడి పిరికిపందలా చనిపోయాడని ఈ సందర్భంగా ట్రంప్ అన్నారు. తమ లక్ష్యం పూర్తి చేసిన అమెరికా సైన్యం ఈశాన్య సిరియా నుంచి వైదొలుగుతుందని ఈ సందర్భంగా ట్రంప్ తెలిపారు.













