సిరియాలో విజయం సాధించాం : ట్రంప్
సిరియా నంచి అమెరికా దళాల ఉపసంహరణ ప్రారంభమైంది. సిరియాలో ప్రమాదకర ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్‌ను ఓడించామని అమెరికా ప్రకటించింది. సిరియాలో ఐఎస్‌ను ఓడించాం. నా అధ్యక్ష కాలంలో పూర్తిచేయాలనుకున్న లక్ష్యం అది అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. సిరియా నుంచి అమెరికా దళాలు వెనుతిరిగాయని వైట్‌హౌజ్ ప్రెస్ సెక్రటరీ సారా శాండర్స్ తెలిపారు. ఉగ్రవాదం వల్ల, లేదా వేరే ఏ ఇతర కారణం వల్ల కానీ ప్రపంచవ్యాప్తంగా అమెరికా ప్రయోజనాలకు ప్రమాదం వాటిల్లే సందర్భాల్లో యూఎస్, దాని మిత్రదేశాల దళాలు తమ సేవలందించేందుకు సిద్దంగా ఉంటాయని అందులో పేర్కొన్నారు. సిరిలో విజయం సాధించాం. కానీ ఐఎస్‌పై పోరాటం ఇంకా ముగియలేదు అని యూఎస్ రక్షణ శాఖ ప్రతినిధి డానా డబ్ల్యూవైట్ పేర్కొన్నారు.













