ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన డొనాల్డ్ ట్రంప్
వరుసగా రెండోసారి కూడా అధికారం చేపట్టాలన్న ఉత్సాహంతో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫ్లోరిడాలో ఎన్నికల ప్రచారాన్ని భారీగా ప్రారంభించారు. తన జట్టును మరో నాలుగేళ్లు యథాతథంగా ఉంచాలని, అమెరికాను గొప్పగా ఉంచుదాం అన్నది ఎన్నికల ప్రచారాంశమని ఆయన ప్రకటించారు. ప్రస్తుతం అమెరికా ఆర్థిక వ్యవస్థ ప్రపంచానికి ఈర్ష్య పుట్టించేలా ఉందని చెప్పారు. అమెరికా ఫస్ట్ అనే విధానాన్ని కొనసాగిస్తానని తెలిపారు. ఈ నాలుగేళ్లలో దేశం చాలా పురోగమించిందని, ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఓడిపోతే చాలా ప్రమాదకరమని ఆయన అన్నారు. తన అజెండానూ పూర్తి చేయడానికి మరో నాలుగేళ్ల పాటు అవకాశం ఇవ్వాలని ట్రంప్ కోరారు. 2020 నవంబరులో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి.













