ఏప్రిల్ 30 వరకు ఆంక్షలు : ట్రంప్
అమెరికాలో కరోనా వైరస్ తీవ్రరూపం దాల్చింది. ఇప్పటి వరకు ఆ దేశంలో కరోనా కేసుల సం•్య 1.41 లక్షలకు చేరుకోగా 2,484 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క న్యూయార్క్ రాష్ట్రంలో 60 వేలు కేసులు నమోదు కాగా, 1,000 మంది చనిపోయారు. అగ్రరాజ్యంలో జనవరి 29న తొలి కేసు నమోదు కాగా, మార్చి మూడో వారం వరకు కేసులు 8,000 నమోదయ్యాయి. వారం రోజుల్లో 1,50,000పైగా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏప్రిల్ 30 వరకు ప్రజలు సామాజిక దూరం పాటించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. ప్రజలంతా ప్రభుత్వ నిబంధనల ప్రకారం సామాజిక దూరం పాటించాల్సిందేనని సృష్టం చేశారు. ఈస్టర్ పండుగ నాటికి అంతా సర్దుకోవాలని తాను ఆశించానని, కానీ పరిస్థితులు ఆ దిశగా సాగడం లేదని ట్రంప్ నిరాశ వ్యక్తం చేశారు.













