వైద్యుల సూచనలను ట్రంప్ పాటించడం లేదు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఫాస్ట్ ఫుడ్ అంటే చాలా ఇష్టం. 72 ఏళ్ల ట్రంప్‌కు అధిక కొలెస్ట్రాల్ ఉంది. వైట్‌హౌస్‌లో అడుగు పెట్టిన తరువాత గత ఏడాది ఆయనకు తొలిసారి వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల అనంతరం ట్రంప్‌కు డైట్, ఎక్సర్సైజ్ ప్లాన్‌ను వైద్యులు ఇచ్చారు. అయినా, వాటిని ఆయన పట్టించుకోవడం లేదు. ఆయన మరోసారి వైద్య పరీక్షలు చేయించుకోనున్నారు. ఈ సందర్భంగా ట్రంప్‌కు సన్నిహితంగా ఉండే ఒక డజను మంది వైట్ హౌస్ సిబ్బంది మాట్లాడుతూ వైద్యుల సూచనలను ట్రంప్ పాటించడం లేదని చెప్పారు. తన ఆహారపు అలవాట్లను మార్చుకోవడానికి ట్రంప్ ఇష్టపడడం లేదని అన్నారు. వైట్ హౌస్‌లో ఉన్న ఫిట్నెస్ రూమ్‌లోకి ఆయన ఒక్కసారి కూడా అడుగు పెట్టలేదని తెలిపారు. ఎక్సర్సైజ్ అంటే వేస్ట్ ఆఫ్ ఎనర్జీ అని అంటారని చెప్పారు.













