ఆ భేటీ అద్భుత విజయం : ట్రంప్
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌తో సమావేశమవడం అద్భుత విజయమని తన మంత్రివర్గ సహచరులతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. జూన్ 12న సింగపూర్‌లో ఇరువురు నేతల భేటీ అనంతరం మొదటిసారిగా ఆయన కేబినెట్ సమావేశం నిర్వహించారు. మనకు అద్భుత విజయమని, నమ్మశక్యం గాని అనుభవమని ట్రంప్ పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు ఉన్నాయన్నారు. బాలిస్టిక్ సహా ఇతర క్షిపణులను పంపడం నిలిపి వేశామన్నారు. ఇది వరకే క్షిపణి ప్రయోగ కేంద్రాలను ధ్వంసం చేశారని, సంపూర్ణ అణు నిరాయుధీకరణ ప్రారంభమైనట్లు మంత్రివర్గ సభ్యులకు ట్రంప్ వివరించారు. ఇరు దేశాల సంబంధాలతో ఘననీయమైన పురోగతి సాధించినట్లు సెక్రటరీ స్టేట్ మైక్ పొంపియా తెలిపారు.













