నేనే నంబర్ 1.. నా తర్వాతే మోదీ
ఫేస్బుక్లో తాను నంబర్ 1 స్థానంలో ఉన్నానని, భారత ప్రధాని నరేంద్ర మోదీ తన తర్వాత రెండో స్థానంలో ఉన్నారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. భారత్‌లో జనాభా ఎక్కువడా ఉండడం మోదీకి కలిసివచ్చిందని వ్యాఖ్యానించారు. మీకు 150 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. నాకు 35 కోట్ల మంది ఉన్నారు. మీకు అడ్వాంటేజ్ ఉంది అని మోదీతో చెప్పానన్నారు. నిజానికి ఫేస్బుక్లో మోదీకి 4.40 కోట్ల మంది ఫాలోవర్లు ఉండగా, ట్రంప్‌కు 2.70 లక్షల మంది మాత్రమే ఉన్నారు. అధికారిక గణాంకాల ప్రకారం ప్రస్తుతం భారత్ జనాభా 130 కోట్లు. అమెరికా జనాభా 32.5 కోట్లు.













