ఈయూను హెచ్చరించిన ట్రంప్
ఇరాన్‌పై అమెరికా ఆంక్షలను ఉల్లంఘించినట్టయితే తీవ్ర పర్యవసానాలు ఎదుర్కోవాల్సి వస్తుందని యురోపియన్ యూనియన్ దేశాలను ట్రంప్ ప్రభుత్వం హెచ్చరించింది. తమ ఆంక్షలు ఉల్లంఘించినట్టయితే కఠినమైన జరిమానాలు తప్పవని బెదిరించింది. కాగా, ఆంక్షలు ఉల్లంఘించకుండా ఇరాన్‌తో వ్యాపారం సాగించడాన్ని సులభతరం చేసేందుకు గానూ ప్రత్యామ్నాయ డబ్బు చెల్లింపు మార్గాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఈయూ భావిస్తోంది. ఈయూ చేసే ఈ ప్రయత్నాలను ట్రంప్ సర్కార్ నిశితంగా గమనిస్తోంది. ఈయూ ప్రతినిధి మాట్లాడుతూ ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకునేందుకు సన్నాహాలు చురుకుగా సాగుతున్నాయని, త్వరలోనే ఇందుకు సంబంధించి ప్రకటన వెలువడే అవకాశం వుందని అన్నారు.













