మలేషియా తెలుగు అకాడమిని సందర్శించిన టీఆరెస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల
-ప్రారంబోత్సవానికి సీఎం కెసిఆర్, ఎంపీ కవిత గార్లను ఆహ్వానిస్తామన్న ప్రెసిడెంట్ అచ్చయ్య కుమార్
టీఆరెస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల టీఆరెస్ పార్టీ మలేషియా శాఖ ప్రారంబోత్సవానికి మలేషియా వెళ్లారు. పర్యటనలో భాగంగా తెలుగు అకాడమీ ఆఫ్ మలేషియా ఆహ్వానం మేరకు అకాడమిని సందర్శించిన మహేష్ బిగాలను అకాడమీ ప్రెసిడెంట్ అచ్చయ్య కుమారురావు సన్మానించారు.
ఈ కార్యక్రమంలో మహేష్ బిగాల మాట్లాడుతూ రెండు వందల ఏండ్ల క్రిందట ఉద్యోగ రీత్యా మలేషియా కి వచ్చిన తెలుగు పూర్వికులు మలేషియా లో తెలుగు భాషాభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను కొనియాడారు. తెలుగు అకాడమీ నిర్మించి 3000 విద్యార్థులకు పైగా తెలుగు నేర్పించడం అనేది మహా అద్భుతం. తెలుగు మహా సభలకు మలేషియా నుండి వంద మందికి పైగా హాజరైనందుకు ధన్యవాదాలు తెలిపారు. మలేషియాలో తెలుగు భాషాభివృద్ధికి ఇంకా పాటుపడాలని అకాడమిని కోరారు.
అచ్చయ్య మాట్లాడుతూ వెనుకబడి పోతున్న తెలుగు భాషకు జీవం పోసిన ఏకైక నాయకుడు సీఎం కెసిఆర్ గారని అన్నారు. తెలుగు బాషా పరిరక్షణకు సీఎం కెసిఆర్ చేస్తున్న కృషి స్ఫూర్తిదాయకమన్నారు. ఇది వరకు ఎన్నో తెలుగు సభలకు హాజరయ్యాం కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన తీరు, ఇచ్చిన ఆతిథ్యం చాల ప్రత్యేకమన్నారు. తెలుగు మహాసభల భాగంగా రవీంద్రభారతి లో ఎంపీ కవిత గారి ప్రసంగం అత్యత్భూతం అని అన్నారు. వచ్చే తెలుగు మహా సభలను రీజినల్ గా మలేసియాలో జరుపుకోవడానికి సీఎం కెసిఆర్ గారి అనుమతి కోరామని మహేష్ బిగాలకు తెలిపారు. త్వరలో జరిగే అకాడమీ ప్రారంబోత్సవానికి సీఎం కెసిఆర్ ఎంపీ కవితల గార్లను ఆహ్వానిస్తామన్నారు.ఈ కార్యక్రమంలో టీఆరెస్ మలేషియా కోర్ కమిటీ మెంబెర్ చిట్టి బాబు, అకాడమీ కౌన్సిల్ మెంబెర్ వెంకట్, మారుతి పాల్గొన్నారు.













