సీఎం కెసిఆర్ గారికి కృతజ్ఞతలు తెల్పిన మహేష్ బిగాల
ఆమ్నెస్టీ బాధితులను తీసుకరావడానికి టీఆరెస్ ప్రభుత్వ బృందం దుబాయ్ వెళుతున్న నేపథ్యంలో టీఆరెస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల సీఎం కెసిఆర్ గారికి ధన్యవాదాలు తెలిపారు.
మహేష్ బిగాల మాట్లాడుతూ యూఏఈ ప్రభత్వం విధించిన ఆమ్నెస్టీ అక్టోబర్ నెలలో ముగుస్తుండడం తో గల్ఫ్ ఎన్నారైల పక్షపాతి అయినా సీఎం కెసిఆర్ గారు ప్రభుత్వం తరుపున ఒక బృందాన్ని పంపించడం గల్ఫ్ బాధితులు మరియు వారి కుటంబాలు చాల సంతోషం వ్యక్తం చేస్తున్నారు అన్నారు.ఆ బృదంలో నన్ను ఒకరిని చేసినందుకు సీఎం కెసిఆర్ గారికి కృతజ్ఞతలు తెలిపామన్నారు.మంత్రి కేటీర్ గారు కూడా దుబాయికి రానున్నారు అని అన్నారు. గల్ఫ్ లో మరణించిన తెలంగాణ వాళ్లందరికీ ఎక్స్గ్రేషియా ప్రకటించినందుకు మరియు ఎన్నారైలకు రైతుబంధు చెక్ ల నిబంధనలు సరలించి వారి కుటుంబ సబ్యులకు ఇచ్చేలా చేసినందుకు ఎన్నారైలందరి తరుపున ధన్యవాదాలు అన్నారు.













