నిజామాబాద్ లో కేటీఆర్ మరియు కవిత గారి తో మహేష్ బిగాలా భేటీ
ఈ రోజు నిజామాబాద్ లో ఐటీ హబ్ శంఖుస్థాపన కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చిన మంత్రి కేటీఆర్ గారితో, అలాగే నిజామాబాదు లోకసభ ఎంపీ శ్రీమతి కల్వకుంట్ల కవిత గారితో పలు ఎన్నారై సమస్యలపైనా చర్చలు జరిపి, సత్వరమే చర్యలు చేపట్టాలని వినతి పత్రాలు సమర్పించారు. ఇటీవలే పలు దేశాలు పర్యటించిన తెరాస ఎన్నారై కో ఆర్డినేటర్ మహేష్ బిగాలా గారు ప్రవాస తెలంగాణ బిడ్డలతో పలు సమావేశాల్లో పాల్గొని వారి నుండి వచ్చిన సూచనలతో పాటు, క్రింద తెలిపిన పలు విషయాల పైన చర్చలు జరిపి సత్వర ప్రకటన జారీ చేయవల్సిందింగా కోరారు.
ఇందులో మొదటగా యూఏఈ ప్రభుత్వం ఇటీవలే ఆగష్టు 1 నుండి -అక్టోబర్ 31 వ తారీకు వరకు amenesty ప్రకటించిందని, దీనిలో భాగంగా అక్రమంగా దేశంలో ఉంటున్న అన్ని దేశాల కార్మికులు, ఉద్యోగుల దేశం విడిచి వెళ్లేందుకు అవకాశం కల్పిస్తారు. అక్రమంగా ఉంటున్న తెలంగాణ వాసులను తెలంగాణ కు తిరిగిరావడానికి అవసరమైన చర్యలు, అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని ఈ విషయంలో స్పందించమని కోరారు. ఈ అవకాశాన్ని వినియోగించుకొనే విధంగా తెలంగాణ బిడ్డలను ఆదుకునే విధంగా మన ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు.
ఇటీవల మీరు ప్రవేశ పెట్టిన రైతులకు కొత్త పాస్ పుస్తకాల విషయం లో, వ్యవసాయ భూముల స్వంతదారులు గా వున్న ప్రవాస తెలంగాణవాదులు మరియు OCI (ఓవర్సీస్ సిటిజెన్ అఫ్ ఇండియా) ఆధార్ కార్డు లేకపోవడం వల్ల మరియు కేవలం పాసుబుక్ తీసుకోవడానికే ప్రత్యక్షంగా రాలేక ఇబ్బంది పడుతున్నారు. తమ తమ పూర్వీకుల నుండి సంప్రాప్తించిన వ్యవసాయ భూములకు సంబందించిన పాస్ పుస్తకాలను రెవిన్యూ అధికారులు నిలిపివేశారు. దయ చేసి మీరు ఈ విషయాన్నీ పరిశీలించి కొత్త పాస్ పుస్తకాల జారీ చేసే వియషంలో, భూముల అమ్మకాల సమయంలో ఉద్యోగ రీత్యా విదేశాల్లో స్థిర నివాసం ఏర్పరుచుకొని OCI కార్డు వున్నా ప్రవాస తెలంగాణ బిడ్డలకు ఆధార్ కార్డు విషయంలో సడలింపు కల్పించగలరని విజ్ఞప్తి.
ఇటీవల జారీ చేసిన రైతు బంధు పెట్టుబడి పథకం చెక్ లు తెలంగాణ ఎన్నారై లకు ఇప్పటివరకు కూడా జారీ చేయబడలేదు. దూర దేశాల్లో వున్న ప్రవాస తెలంగాణ బిడ్డలు కేవలం రైతుబంధు చెక్ తీసుకొనేందుకు తమ తమ ప్రాంతాలకు తరలిరావడం ఖర్చుతో కూడుకున్న ప్రక్రియ అని తాము ప్రతిపాదించిన కుటుంబ సభ్యుడికి చెక్ ఇవ్వాలని నన్ను చాల మంది ఎన్నారై లు కోరడం జరిగింది. మలివిడత చెక్ లు కూడా రైతులకు అందించబోతున్న ఈ తరుణంలో పైన తెలిపిన విషయాల పైన మార్గదర్శకాలు రూపొందించగలరని తెలంగాణ ప్రవాసులందరి తరపున నా విజ్ఞప్తి.
గల్ఫ్ తో పాటు ఇతర దేశాల ఎన్నారై లు ఎన్నారై పాలసీ ప్రకటన కోసం వేచి చూస్తున్నారని, దీనికి సంబందించిన ప్రకటన సత్వరమే జారీ చేయవలసిందిగా మంత్రి కేటీఆర్ కు, ఎంపీ కవిత గారికి విజ్ఞాపన చేసారు. ఈ అవకాశం కల్పించిన వారిరువురికి కృతజ్ఞతలు తెలిపారు.













