న్యూజిలాండ్ లో దీక్షా దివస్ !
తెరాస ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల ఆదేశాల మేరకు న్యూజిలాండ్ లో దీక్ష దివస్ ని జరిపారు. ఈ సందర్భంగా దీక్షా దీవస్ స్ఫూర్తిని, అమరుల త్యాగాలని, జ్ఞాపకాలను, పోరాటాలను న్యూజిలాండ్ శాఖ స్మరించుకుంది. న్యూజీలాండ్ ప్రెసిడెంట్ జగన్ వాడ్నలా మాట్లాడుతూ ఈరోజు మనం తెలంగాణ పౌరునిగా తల ఎత్తుకొని తిరుగుతున్నాం అంటే అది మన కెసిఆర్ సర్ దీక్షా ఫలితమే అని సగర్వాంగా చెప్పుకుంటూ న్యూజీలాండ్ శాఖ ద్వారా సారుకు ప్రత్యేక అభినందనలు తెలియ జేసుకుంటున్నాను అని అన్నారు. మన ముఖ్యమంత్రి కెసిఆర్ గారు చేసిన చేస్తున్న అభివృద్ధి పనులు, పథకాల వల్ల మన రాష్ట్రము ఎంతో ముందుంది అని తెలియజేస్తున్నాం. మన సారు ఆయురారోగ్యాలతో ఉండాలని మా అందరి తరుపున భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.
ఈ కార్యక్రములో తెలంగాణ అమరులకు, తెలంగాణ ఉద్యమ వీరులకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రములో విజయ్ కొసన, కళ్యాణ్ కసుగంటి, అరుణ్ ప్రకాష్ రెడ్డి, రామారావు రాచకొండ, కిరణ్ పోకల, మౌనిక కొలిపాక, పానుగంటి శ్రీనివాస్, మోహన్ రెడ్డి, సింహరావు ఏనుగంటి, వరుణ్ రావు పాల్గొన్నారు.
న్యూజీలాండ్ లో దీక్షా దివస్ ని నిర్వహించిన బృందానికి మహేష్ బిగాల ప్రత్యేకంగా అభినందిచారు.













