కరోనా వేళ…నిరుపేదలను ఆదుకున్న ట్రైస్టేట్ తెలుగు అసోసియేషన్
ట్రైస్టేట్ తెలుగు అసోసియేషన్ తెలుగు రాష్ట్రాల్లో కరోనా కారణంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్న నిరుపేదలను ఆదుకునేందుకు ముందుకు వచ్చింది. విజయవాడ – భవానీపురం ప్రాంతంలో ఉన్న దాదాపు 67 నిరుపేద కుటుంబాలకు కావాల్సిన నిత్యావసర వస్తువులను పంపిణీ చేసింది. ఆకలితో అల్లాడుతున్న ఈ కుటుంబాలు తమను ఆదుకున్నందుకు ట్రైస్టేట్ తెలుగు అసోసియేషన్ కు, వలంటీర్లకు ధన్యవాదాలు తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో మరింతమందిని ఆదుకునేందుకు ఎన్నారైలు కూడా సహాయపడాలని ట్రైస్టేట్ తెలుగు అసోసియేషన్ కోరింది. డొనేషన్లు ఇవ్వాలనుకున్నవారు ఈ లింక్ ద్వారా అందించవచ్చని కోరింది.
Donations can be made in the following way
*Online*
https://telugu.org/events/donate-for-starving-families/
*Checks:*
Checks are Payable to Tri-State Telugu Association and mail them to P.O.BOX 627, Hines, IL – 60141













