పారిస్ లో డొనాల్డ్ ట్రంప్ కు టాప్ లెస్ నిరసన !
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చేదు అనుభవం ఎదురైంది. మొదటి ప్రపంచ యుద్ధం ముగిసి వందేండ్లు పూర్తి అయిన సందర్భంగా పారిస్‌లో నిర్వహిస్తున్న సంస్మరణ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ట్రంప్‌కు ఓ మహిళా హక్కుల కార్యకర్త ఉంచి ఊహించని షాక్ ఎదురైంది. కార్యక్రమానికి హాజరయ్యేందుకు చాంప్ప్ ఎలిసీ మార్గంలో ట్రంప్ కాన్వాయ్ వస్తుండగా మహిళా కార్యకర్త ఆకస్మాత్తుగా అర్ధనగ్నంగా దూసుకువచ్చారు. అమె తన ఛాతి భాగంలో నకిలీ శాంతిదూత అని రాసుకుని ట్రంప్‌కు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఈ ఘటనకు పాల్పడింది తామేనని పారిస్‌కు చెందిన ఫెమెన్ అనే మహిళ హక్కుల సంస్థ ప్రకటించింది. ఈ నిరసనకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పారిస్ పోలీసులు ప్రకటించారు.













