భారత్ ఐటీ రంగానికి హెచ్ 1బీ భారం!
హెచ్1 బీ వర్క్ వీసా నిబంధనలు కఠినతరం చేయడం వల్ల భారతీయ ఐటీ సేవల సంస్థలకు మరింత భారంగా పరిణమిస్తోంది. ఫలితంగా ఆ సంస్థల మార్జిన్లపైనా ప్రభావం చూపిస్తోంది. ఆన్సైట్ నియామకాలు పెరుగుతుండటం, హెచ్1 బీ వీసా నిబంధనలు మరింత కఠినతరం కావడం వంటివి ఇందుకు దోహదం చేస్తున్నాయి. ఇక్రా రేటింగ్స్ అంచనాలను చూస్తే హెచ్1 బీ వీసాలకు ప్రస్తుతం అర్హులైన సైతం తగ్గే అవకాశం ఉంది. అమెరికా ఇందుకు సంబంధించిన వీసాలను అత్యంత నిపుణులైన వారికి అత్యంత ఎక్కువ వేతనం పొందేవారికి మంజూరుచేస్తోంది. అమెరికా చర్యల వల్ల హెచ్1 బీ వీసాలు ఎక్కువగా భారత ఐటీ రంగానికే అవసరం ఉంది. ఈ వీసాలకింద హెచ్1బీ వీసాలపై ఆధారపడిన కంపెనీలతో పోలిస్తే ఈ వీసాలున్న కంపెనీల వేతనం 25 శాతం తక్కువగా ఉంది. అమెరికా పూర్తిస్థాయి ఉద్యోగులు 15శాతంగా ఉంటే హెచ్1 బీ వీసాలపై ఆధారపడి కంపెనీగా గుర్తిస్తారు. ఎక్కువ వేతనం, లేదా నైపుణ్యం అధారంగా హెచ్1 బీ వీసా ఇస్తారు. హెచ్1 బీ వీసా దరఖాస్తుదారులకు పరిహారం సైతం భారతీయ కంపెనీలు పెంచాల్సి ఉంటుంది. దీనివల్ల కంపెనీల మార్జిన్లపై ఎక్కువ ప్రభావం పడుతుందని రేటింగ్స్ సంస్థలు చెపుతున్నాయి.
అయితే ఈ ప్రభావం ఆయా కంపెనీల పనితీరు ఆధారంగా ఉంటుంది. హెచ్1 బీ వీసాలపై ఎక్కువ ఆధారపడే తీరును బట్టి ఉంటుంది. మొత్తంగా చూస్తే ఎంట్రీలెవల్ ప్రోగ్రామర్లు వంటి వారికి ఇక హెచ్1 బీ వీసాలు బహు దూరం అనే చెప్పుకోవచ్చు.













